mobile header

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, కానూరు విజయవాడ నందు ‘స్పుత్నిక్ వి’ కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ప్రతిరోజూ ఉదయం గం.9.00ల నుండి సాయంత్రం గం.5:00ల వరకు ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ లో ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సినేషన్ ప్రక్రియ
  • 69 దేశాలలో ఆమోదం పొందిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సినేషన్
  • రెండు డోసుల మధ్య 21 రోజుల వ్యవధి
  • కోవిన్ యాప్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • 94.3% సమర్థత కలిగిన టీకా గా గుర్తింపు
  • డాక్టర్ రాజేష్ కోట, మెడికల్ డైరెక్టర్, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, కానూరు విజయవాడ

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, కానూరు విజయవాడ నందు ‘స్పుత్నిక్ వి’ కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉందని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కోట ఈ ప్రకటన ద్వారా తెలిపారు. రష్యా దేశ సాంకేతికతతో రూపొందిన స్పుత్నిక్ వి, అత్యంత ప్రభావవంతమైనదని మరియు 69 దేశాలలో ఆమోదం పొందిన వ్యాక్సినేషన్ అని ఆయన పేర్కొన్నారు. స్పుత్నిక్ వి రెండు డోసులు వేర్వేరుగా వుంటాయని, రెండు డోసులకు ఒకే డెలివరీ మెకానిజమ్ను ఉపయోగించే టీకాల తో పోల్చితే స్పుత్నిక్ వి విభిన్నమైనది కాలం రోగనిరోధక శక్తిని అందిస్తుందని వివరించారు.

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ప్రతిరోజూ ఉదయం గం.9.00ల నుండి సాయంత్రం గం.5:00ల వరకు ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి డోసు అనంతరం 21 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వబడుతుందని చెప్పారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా కోవిన్ అప్లికేషన్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కోట తెలిపారు. వ్యాక్సినేషన్ ద్వారా రోగనిరోధక శక్తి పొందినప్పటికీ, ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మరియు కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని ఆయన సూచించారు.

media detail

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ గురించి :-

భారతదేశంలోని క్యాన్సర్ చికిత్స కు ప్రామాణికంగా నిలిచి, క్యాన్సర్ చికిత్స ప్రొటొకాల్స్ మరియు ఆధునిక ప్రమాణాలను అనుసరిస్తూ అత్యధిక క్యాన్సర్ ఆస్పత్రుల కలిగిన ఏకైక హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులచే మెడికల్ ఆంకాలజీ, హెమటో ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మరియు రేడియోథెరఫీ లో అత్యున్నత ఆధునికమైన సాంకేతిక పరికరం తో ప్రపంచ స్థాయి కాన్సర్ చికిత్సలను అందిస్తున్న కాన్సర్ హాస్పిటల్ అమెరికన్ ఆంకాలజి ఇన్స్టిట్యూట్, విజయవాడ మరియు గుంటూరు, మరిన్నివివరాలకోసం సంప్రదించండి 7330901188.

Related Media